3 September, 2026 | 2:05 AM

ఇచ్చిన హామీలు అమలు చేయాలి

03-09-2026 | 01:02am

బీఆర్‌ఎస్ నిరసన హోరు  

ఎల్బీనగర్/ బడంగ్పేట్/ రాజేంద్రనగర్/శేరిలింగంపల్లి, సెప్టెంబర్ ౨ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు ‘కాంగ్రెస్ బాకీ కార్డు‘ (Congress dues card) పేరుతో ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించాయి.ఎల్బీనగర్లో సుధీర్ రెడ్డి నేతృత్వంలో సరూర్నగర్ స్టేడియం నుంచి కొత్తపేట వరకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (MLA Devireddy Sudheer Reddy) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది.

మహిళలకు మహాలక్ష్మి బకాయిలు రూ 82,500, పింఛన్ల బకాయిలు, రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రైతు కూలీలకు రూ 12 వేలు,రూ.2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఆటో కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

మహేశ్వరం బడంగ్పేట్లో కౌశిక్ రెడ్డి నిరసన.. బాలాపూర్ విశాల్ మార్ట్ నుంచి బడంగ్పేట్ తాసిల్దార్ కార్యాలయం వరకు బీఆర్‌ఎస్ యువ నేత పట్లోళ్ల కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ఉప తాసిల్దార్కూ వినతిపత్రం అందజేశారు.శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మీర్పేట్లలోనూ బీఆర్‌ఎస్ నాయకులు విస్తృత ఆందోళనలు చేపట్టి, హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.