గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
02-09-2026 | 08:30pm
బోథ్. సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): సోనాల మండలం(Sonala Mandal)లోని గొల్లపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు అనే వ్యక్తి తన పంట చేనులో గంజాయి సాగు(Cannabis cultivation) చేస్తుండడంతో ఆయన చేనులో ఐదు గంజాయి మొక్కలు ఎస్సై పురుషోత్తం(SI Purushotham) స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రీమాండు కు తరలించడం జరిగిందని సిఐ గురుస్వామి(CI Guruswamy) తెలిపారు. పత్తి పంటలో అంతర పంటగా గంజాయిని పండిస్తున్నట్లు గుర్తించి మొక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న మొక్కలు గంజాయి మొక్కలే అని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించి నట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న 50 వేల రూపాయలు విలువ ఉందన్నారు. అంతేగాక గంజాయి సాగు చేయడం అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమని సిఐ హెచ్చరించారు.






