బ్యాంకులు రుణ లక్ష్యాలను సాధించాలి
అడిషనల్ కలెక్టర్ ఎన్‌వై గిరి
కామారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): అర్హులైన రైతుల(farmers)కు సకాలంలో రుణాలు మంజూరు(loan sanctioning) చేయాలని అదనపు కలెక్టర్ ఎన్ వై గిరి(NY Giri) అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్లో జూన్ 2026తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ , జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి(NY Giri) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక రుణ ప్రణాళిక పురోగతిని అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ సమీక్షించారు.
వ్యవసాయ రంగానికి(agricultural secto) మరింతగా రుణాలు అందించాలని, పంట రుణాలను(crop loan) సకాలంలో రెన్యువల్ చేయడంతో పాటు అర్హులైన రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి నిర్దేశించిన రుణ లక్ష్యాలను కూడా నిర్ణీత సమయంలో సాధించాలని సూచించారు.
ఎస్సీ యాక్షన్ ప్లాన్, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకం, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాల కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి అర్హులకు రుణాలు మంజూరు చేయాలని తెలిపారు.
స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానాన్ని మరింత పెంచడంతో పాటు మంజూరైన రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు. ఈ సమావేశంలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్, భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రతినిధి, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.






