17 March, 2026 | 12:34 PM

కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!

17-03-2026 11:16 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి( Pilot Rohith Reddy) భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) షోకాజ్ నోటీసు జారీ చేసింది. రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం(BRS High Command) తీవ్రంగా పరిగణించింది. చట్టబద్ధమైన, నైతిక ప్రమాణాలకు తాము కట్టుబడి ఉంటామని నొక్కిచెబుతూ, మాదకద్రవ్యాలతో సహా ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలతోనైనా సంబంధాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. 

పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) ఆదేశాల మేరకు, ఏడు రోజులలోపు వివరణాత్మక లిఖితపూర్వక వివరణను సమర్పించాలని ఈ నోటీసు రోహిత్ రెడ్డిని ఆదేశిస్తోంది. తుది నిర్ణయం వెలువడే వరకు పార్టీ, అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని పార్టీ అతన్ని కోరింది. నిర్దేశిత గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో విఫలమైతే, పార్టీ నిబంధనల(Party rules) ప్రకారం క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ హెచ్చరించింది.

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం(Moinabad Drugs Party Scandal) కేసులో డీసీపీ యోగేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీలు, ఫాంహౌస్ లో ఎప్పట్నుంచి డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి, ఇప్పటివరకు ఫాంహౌస్ లో పార్టీలకు ఎవరెవరు హాజరయ్యారనే కోణంలో విచారించనున్నట్లు తెలుస్తోంది.