16-02-2026 01:28:10 PM
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను బైకాట్ చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల ను తాండూర్ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు సోమవారం బైకాట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటు మరో 9 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నందుకు నిరసనగా బైకాట్ చేసి బయటకు వచ్చామని ఆ పార్టీ ఫ్లోర్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింలు మరియు పార్టీ ఇంచార్జి శ్రీశైలం రెడ్డి అన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల పై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.