7 March, 2026 | 5:17 PM

సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకోవాలి

07-03-2026 01:11 AM

కోదాడ, మార్చి 6 : భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను పొందేందుకు తెలంగాణ ఆర్టీసీ చేపడుతున్న కళ్యాణ తలంబ్రాల బుకింగ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.

శుక్రవారం కోదాడలోని బస్ డిపో లో సీతారాముల కళ్యాణ తలంబ్రాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల  27న శ్రీరామనవమి అనంతరం స్వామివారి కల్యాణ తలంబ్రాలను బుకింగ్ చేసుకున్న వారికి ఆర్టీసీ సిబ్బంది ఇంటికి తలంబ్రాల ప్యాకెట్లు అందిస్తామన్నారు. ఇందుకోసం రూ 151 తో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నాగేశ్వరరావు తోపాటు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.  భద్రాద్రి తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకోవాల్సిన వారు 9666931799 - 9154298693 నెంబర్లకు సంప్రదించాలన్నారు.