ఫౌజీ డేట్ చెప్పేశాడు డార్లింగ్!
రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’తో వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 3న థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, టీ సిరీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవిశంకర్, భూషణ్‌కుమార్ నిర్మించారు.
తాజా రిలీజ్ డేట్ పోస్టర్‌లో యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ యోధుడిలా, రక్తంతో తడిసిన దుస్తులు, ఒంటి నిండా గాయాలతో, చుట్టూ నేలకొరిగిన సైనికుల మధ్య తుపాకీని పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: సుదీప్ ఛటర్జీ; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు; ప్రొడక్షన్ డిజైన్: అనిల్ విలాస్ జాదవ్.






