calender_icon.png 16 February, 2026 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వాన్ని చాటిన రక్తదాతలు

16-02-2026 05:56:44 PM

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండలం మల్లుపేట్ గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల చిన్నారి కళ్యాణికి గుండె ఆపరేషన్ నిమిత్తమై సికింద్రాబాద్ లోని కిమ్స్ వైద్యశాలలో ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సామల సంతోష్ రెడ్డి, రోహిత్,విక్రమ్ లు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ... ధర్మారావుపేట గ్రామానికి చెందిన సామల సంతోష్ రెడ్డి 47 వ సారి రక్తదానం చేయడమే కాకుండా తన తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులను కూడా రక్తదానంలో భాగస్వాములుగా చేయడం చిన్నారి ప్రాణాలను కాపాడడం కోసం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు,రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరాయంగా పనిచేస్తున్నామని రక్త దానం చేయడానికి యువత ముందుకు రావాలని రక్త కొరత లేని సమాజం కోసం కృషి చేస్తామని అన్నారు.