15 June, 2026 | 1:10 AM

రక్తదాతలే నిజమైన ప్రాణదాతలు

15-06-2026 12:08 AM

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 

ములకలపల్లి, జూన్ 14 (విజయక్రాంతి): రక్తదాతలే నిజమైన ప్రాణదాతలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ములకలపల్లి మండలం సీతాయిగూడెం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారం సుధీర్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహోన్నతమైన సేవ అని ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదని పేర్కొన్నారు. సమాజ సేవా భావంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన కారం సుధీర్ ను అభినందిస్తూ శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కారం సుధీర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజి, తాండ్ర ప్రభాకర్ రావు, మండల అధ్యక్షుడు ఎండి జాహీరుద్దీన్, సురభి రాజేష్, జి.తిరుపతిరెడ్డి, నాగళ్ళ వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది  ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.