15 July, 2026 | 12:38 AM

ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్లకు శ్రీకారం

15-07-2026 12:38 AM
  1. ఈ నెల 20న క్యూర్ పరిధిలో..
  2. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): క్యూర్ పరిధిలోని పేదల సొంతింటి స్వప్నాన్ని నిజం చేసేందుకు ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలో దశల వారీగా లక్ష ఎల్‌ఐజి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని తెలిపారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయం క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్ల పై హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల పథకానికి శ్రీకారం చూడుతున్నామని ప్రకటించారు. మంత్రి అజారుద్దీన్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పథకానికి సంబంధించిన విదివిధానాలను, దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానం తదితర పూర్తి మార్గదర్శకాలను ప్రకటిస్తామని వివరించారు.

తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున ఆయా స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైన చోట వెయ్యి వరకు నిర్మిస్తామని తెలిపారు. క్యూర్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాలల్లో స్థలాలను గుర్తించామని, ఈ స్థలాలను ఇప్పటికే హౌసింగ్ విభాగం పొజిషన్ లోకి తీసుకుందని  మంత్రి పొంగులేటి వెల్లడించారు.