15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ
బీహార్ మహిళా క్రికెటర్ సంచలనం
చరిత్ర సృష్టించిన అక్షర గుప్తా
భగల్‌పూర్, జూన్ 18 : భారత క్రికెట్‌లో బిహార్ నుంచి చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ దూసుకొచ్చి కొన్ని నెలలైనా గడవకముందే మహిళల క్రికెట్‌లో సైతం అదే రాష్ట్రం నుంచి ఓ అమ్మాయి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ళకే ట్రిపుల్ సెంచరీ సాధించింది. అండర్ 19 మహిళల వన్డే క్రికెట్‌లో దూసుకొస్తున్న అక్షర గుప్తా తాజాగా చరిత్ర సృష్టించింది.
126 బంతుల్లో 306 పరుగులతో వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. కేవలం 126 బంతుల్లో 242.86 స్ట్రుక్‌రేట్‌తో 306 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 55 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 34 బంతుల్లో సెం చరీ పూర్తి చేసుకుంది. భారత దేశవాళీ మహిళా క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ముంబైకి చెందిన ఇరా గుప్తా పేరిట ఉంది. ఆమె 346 పరుగులతో అజేయంగా నిలిచింది.






