19 June, 2026 | 3:10 AM

పీవీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

19-06-2026 01:42 AM
  1. మాజీ ప్రధానికి 16 భాషల్లో ప్రావీణ్యం
  2. విద్యార్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
  3. బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ సందర్శన
  4. విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ
  5. మధ్యాహ్న భోజన కార్యక్రమానికి శ్రీకారం
  6. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చా రు. 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ.. దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి ఆకాంక్షించారు.

హైదరాబాద్ బేగంపేట బ్రాహ్మణ వాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ను కేటీఆర్ గురువారం సంద ర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభిం చి, వారితో కలిసి భోజనం చేశారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2023లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం’ను, తమ ప్రభుత్వంలో విద్యారంగంలో అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ విద్యా ర్థుల సంక్షేమానికి దోహద పడే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలుచే స్తామని తెలిపారు.

పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుందని, సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పేర్కొన్నారు. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌కు అవసరమైన అదనపు తరగతి గదు లు, ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యా ర్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మె ల్సీ సురభి వాణీదేవి సేవలను ప్రశంసించారు. 

పేద విద్యార్థులకు అండగా నిలవడం సామాజిక బాధ్యత: తలసాని 

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు చేయూత అందించడం సమాజ బాధ్యత అని తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ట్రస్ట్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యా సేవలను విస్తరింపజేస్తున్న ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని ఆయన అభినందించారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి తక్షణ సహకారం అందించిన సుబ్బారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. 

పోషకాహారం కూడా అత్యవసరం: ఎమ్మెల్సీ వాణీదేవి

విద్యార్థుల సమగ్ర వికాసానికి నాణ్యమైన విద్యతోపాటు పోషకాహారం అత్యంత అవసరమని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. ఆక లితో ఉన్న విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత సాధించ లేరని, పిల్లలకు సమతుల్య పోషకాహారం అందించినప్పుడే వారి మేధస్సు వికసిస్తుం ది అని అన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ప్రారంభించిన మధ్యా హ్న భోజన కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాపురోగతికి  దోహదపడుతోందని తెలిపా రు. భారత యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు.