19 June, 2026 | 3:11 AM

చిన్నారులను పరామర్శించిన కేటీఆర్, హరీశ్

19-06-2026 01:50 AM

మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి

సిరిసిల్ల, జూన్ 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లిలో పానీపూరీ తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న చిన్నారులను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి గురువారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. చిన్నారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.