19-02-2026 02:39:33 AM
నెదర్లాండ్స్‌పై భారత్ విజయం
ఓడినా గట్టిపోటీనిచ్చిన డచ్ టీం
శివమ్ దూబే మెరుపులు
బౌలింగ్‌లో వరుణ్ మ్యాజిక్
టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ ను భారత్ అజేయంగా ముగించింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి సూపర్ 8 స్టేజ్ కు ముందు ఓటమి లేకుండా ఫుల్ జోష్‌తో సిద్ధమైంది. చివరి మ్యాచ్‌లో మాత్రం నెదర్లాండ్స్ అనుకున్న దానికంటే భారత్ కు గట్టిపోటీనే ఇచ్చింది. మొదట బౌలింగ్ లో వరుస వికెట్లు తీసి ఒత్తిడి పెంచింది. తర్వాత ఛేజింగ్‌లో కొద్దిసేపు మెరుపులు మెరిపించగా భారత్ బౌలర్లు చివర్లో కట్టడి చేశారు.
అహ్మదాబాద్, ఫిబ్రవరి 18 : ఈ మ్యాచ్‌లో ఊహించినట్టుగానే రెండు మార్పులు జరిగాయి. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కు రెస్ట్ ఇచ్చి అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ కోసం తంటాలు పడుతున్న అభిషేక్ శర్మ మళ్లీ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కూడా డకౌటయ్యాడు. ఇన్నింగ్స్ మూ డో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్లో క్లీన్ బౌల్ అయ్యారు. ఈ వరల్ కప్ లో ఆడి న మూడు మ్యాచుల్లోనూ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.
ఇషాన్ కిషన్(18) , తిలక్ వర్మ (31) పర్వాలేదనిపిస్తే సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడలేకపోయాడు. ఈ దశలో శివమ్ దూబే జట్టును ఆదుకున్నాడు. విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో కాస్త తడబడినా ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్లతో నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా కూడా 3 భారీ సిక్సర్లు కొట్టడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. 69/3 స్కోర్ వద్ద క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే.. సూర్య తో కలిసి నాలుగో వికెట్కు 41 పరుగులు జోడించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ రెండు భాగస్వామ్యాలు భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాయి. కాగా శివమ్ దూబే ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లున్నాయి. దూబే మరో సిక్స్ కొట్టే ప్రయత్నంలో వెనుదిరిగాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది.
తర్వాత ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వికెట్లు కోల్పోతున్నా భారీ షాట్లు ఆడుతూ కాసేపు అలరించాడు. లీడ్ , కాచెట్ ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయినప్పటకీ నెదర్లాండ్స్ పూర్తి ఓవర్లు ఎటాకింగ్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంది.
ముఖ్యంగా 19వ ఓవర్లో హార్థిక్ పాండ్యాను నెదర్లాండ్స్ బ్యాటర్ నోత్ కోర్స్ ఉతికారేశాడు. ఆ ఓవర్లో 18 పరుగులు రావడంతో ఉత్కంఠకు దారితీసింది. అయితే, చివరి ఓవర్ దూబే కట్టుదిట్టంగా వేయడంతో భారత్ గెలిచింది. నెదర్లాండ్స్ 7 వికెట్లకు 176 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో చెలరేగాడు. దూబే ౨, బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 193/6 ( శివమ్ దూబే 66, సూర్యకుమార్ యాదవ్ 34, తిలక్ వర్మ 31, హార్థిక్ పాండ్యా 30 ; వాన్ బీక్ 3/56, ఆర్యన్ దత్ 2/19)
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ : డి లీడీ 33, లెవిట్ 24, నో క్రోర్స్ 25 నాటౌట్, వరుణ్ చక్రవర్తి 3/14, దూబే 2/35, బుమ్రా 1/17, పాండ్యా 1/40)
మ్యాచ్ హైలైట్స్
12 పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా సాధించిన విజయం. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా 8 విజయాలతో రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ 7 విజయాలతో మూడో స్థానంలో ఉంది. 10 ఈ టోర్నీలో ఇప్పటివరకూ భారత్ జారవిడిచిన క్యాచ్‌ల సంఖ్య, ఐర్లాండ్ తర్వాత అత్యధిక క్యాచ్‌లు వదిలేసింది భారతే. 7 మ్యాచ్‌లో భారత్ ఉపయోగించిన బౌలర్ల సంఖ్య 6000 క్రికెట్‌లో హార్థిక్ పాండ్యా పూర్తి చేసుకున్న మైలురాయి