బాబు జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనే మనందరి బాధ్యత
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన భట్టి
ఖమ్మం, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ‘బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి, ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఆ మహనీయుని స్ఫూర్తితోనే మన ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తోంది.‘ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఖమ్మం నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి.
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రక్షణ శాఖ మంత్రిగా గానీ, ఇతర ఏ శాఖ బాధ్యతలు చేపట్టినా.. ఆ శాఖకు సరికొత్త ఔన్నత్యాన్ని తీసుకువచ్చిన గొప్ప పరిపాలనాదక్షుడు ఆయన‘ అని డిప్యూటీ సీఎం ప్రశంసించారు.
సామాజిక మార్పు కోసం అవిరళ కృషి
దేశంలో సామాజిక సమానత్వం, మార్పు కోసం జగ్జీవన్ రామ్ అనేక పోరాటాలు చేశారని, దేశ భవిష్యత్తుకు ఆయనో దిక్సూచిలా నిలిచారని భట్టి తెలిపారు. ‘అత్యంత పేదరికం, వెనుకబాటుతనం నుంచి వచ్చినప్పటికీ.. తన కృషితో దేశంలోనే అత్యున్నత స్థానాలకు ఎదిగారు. శాసనసభ్యులు రామదాసు నాయక్, కోరం కనకయ్య, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మాజీ డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్‌కి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
సత్తుపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణం లోని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జగ్జీవన్ రామ్ కి నివాళులర్పించిన కూసంపూడి మహేష్.
సత్తుపల్లి, ఏప్రిల్ 5(విజయ క్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణం లోని వారి విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
తాడిత పీడిత వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్
ఖమ్మం, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి): తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ గారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, శాసనసభ మాజి సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా ఐ యన్ టి యు సి అద్యక్షులు కొత్తా సీతారాములు, జిల్లా ఎస్ సి సెల్ అద్యక్షులు బొడ్డు బంధయ్య, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తూములూరి లక్ష్మీ నరసింహారావుతో శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వకుంట్ల గోపాల్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రామూర్తి నాయక్, నగర ఓ బి సి సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రంగా జనార్ధన్, మద్దినేని రమేష్, ముళ్ళపాటి సీతారాములు, గజ్జి సూర్యనారాయణ, శేఖర్,వేముల మురళి నగర కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకటయ్య, బీరెడ్డి రమేష్, నల్లపు శ్రీనివాస్, రమణ,పందిరాజు గౌడ్, సరవయ్య, కోటియా నాయక్, కోనేటి నారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.
జగ్జీవన్ రామ్‌కి నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు
ఎర్రుపాలెం ఏప్రిల్ 5 ( విజయక్రాంతి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ఆదివారం వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




