calender_icon.png 15 February, 2026 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రి వేళ భగ్గుమన్న పండ్ల ధరలు

14-02-2026 08:59:37 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మహాశివరాత్రి సందర్భంగా వివిధ రకాల పండ్లకు మంచి గిరాకి ఉండటంతో వాటి ధరలు భగ్గుమన్నాయి. శివరాత్రిని పురస్కరించుకొని ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు సాయంత్రం దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించిన తరువాత పండ్లు తినడం అనవాయితీ. దీంతో తప్పనిసరిగా పండ్లు కొనుగోలు చేయాల్సి ఉండగా ధరలు మాత్రం చుక్కలనంటాయి.

ఇదే అదనుగా పండ్ల వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. పండగ సందర్భంగా గిరాకి అధికంగా ఉండటంతో ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలోని బస్ టర్మినల్ నుండి అంబేడ్కర్ చౌరస్తా వరకు జాతీయ రహదారి పొడవునా ఇటు ఎదులాబాద్ రోడ్డులో టెంట్లు వేసుకొని పండ్ల వ్యాపారులు పోటీపడి మరీ విక్రయిస్తున్నారు. పండ్ల ధరలను పరిశీలిస్తే ద్రాక్షకిలో రూ.60 నుంచి 80, పుచ్చకాయ రూ.80 నుంచి 120, కర్బూజ రూ.70 నుంచి 100, అరటిపండ్లు డజను రూ.40 నుంచి 60, సంత్రాలు ఒకటి రూ.10, ఆపిల్ రూ.25 చొప్పున విక్రయించారు. పండగ రోజు ఉపవాస దీక్ష చేసే వారికి తప్పనిసరిగా పండ్లు అవసరం ఉండటంతో ధరలు ఎంత ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేసినట్లు భక్తులు తెలిపారు. ఏది ఏమైనా ఇంతమంచి సమయం మించితే దొరకదు అనే విధంగా ఇష్టానుసారంగా వ్యాపారులు వ్యవహరించాలని భక్తులు చెప్పారు.