11 May, 2026 | 11:56 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

వాముతో కలిగే లాభాలు!

06-07-2025 12:00 AM

చిరుతిళ్లు, పిండివంటలు ఏవి తయారుచేసినా అందులో చిటికెడు వాము వేయాల్సిందే. ఇది ఆహారానికి రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

వాములో ఔషధ గుణాలెక్కువ. విరోచనాలతో బాధపడుతున్నవారు వాము నీళ్లను తాగితే ఉపశమనంగా ఉంటుంది.

వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని చిన్నా, పెద్దా అందరూ తినొచ్చు.

వాము పొడితో దంతాలను శుభ్రం చేసుకుంటే చిగుళ్లు బలంగా మారతాయి.

జలుబుతో బాధపడేవారు వామును ఓ వస్త్రంలో కట్టి వాసన పీలిస్తే ఉపశమనంగా ఉంటుంది.

అన్నంలో వాము పొడిని వేసుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.

వాము రసాన్ని మజ్జిగలో కలిపి తాగితే అతిసారం, అజీర్తి తగ్గుముఖం పడతాయి.

మూత్ర సంబంధ సమస్యలను నియంత్రిస్తుంది. పుల్లటి తేన్పులను తగ్గిస్తుంది. 

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో వాము, నెయ్యి కలిపి తింటే సమస్య తగ్గుతుంది. 

గ్యాస్ ట్రబుల్‌తో బాధపడేవారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో చెంచా వాము వేసి కాసేపు మరిగించి వడగట్టి వేడి వేడిగా తాగితే పొట్టలోని గ్యాస్ తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఈ పొడిని నమిలితే కూడా గ్యాస్ తగ్గిపోతుంది.