31 July, 2026 | 2:25 AM

వయసు మోసాలకు బీసీసీఐ చెక్

31-07-2026 12:00 AM
  1. స్వతంత్ర సంస్థ నియామకం 
  2. తప్పుడు పత్రాలు ఇస్తే నిషేధం

ముంబై, జూలై 30 : భారత క్రికెట్‌లో వయ సు మోసాలకు చెక్ పె ట్టేందుకు బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది. వయో విభాగాల క్రికెట్‌లో పారదర్శకత పెంచేందుకు స్వతంత్ర సంస్థను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.అండర్ -16, అండర్ -19, అండర్- 23 విభాగాల్లో ఆడే క్రికెటర్ల పత్రాలన్నింటినీ ఈ స్వతంత్ర సంస్థ పరిశీలించనుంది.

ఆటగాళ్ల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు వంటి వివరాలను సంబంధి త అధికారులు, విద్యాసంస్థలతో సరిపోల్చి వాటి ప్రామాణికతను నిర్ధారించనుంది. ప త్రాల్లో ఏవైనా తేడాలు లేదా తారుమారు ఉన్నట్లు తేలితే, సంబంధిత ఆటగాడిని బీసీసీఐ వయో విభాగాల టోర్నీల్లో తన రాష్ట్రా నికి ప్రాతినిధ్యం వహించకుండా నిషేధిస్తా రు. చర్యలు తీసుకునే ముందు ఆటగాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, తమ వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించనుంది.