31 July, 2026 | 1:09 AM

కోచ్‌గా ఫ్లెమింగ్, కెప్టెన్‌గా రూట్

31-07-2026 12:00 AM

ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో మార్పులు

లండన్, జూలై 30 : ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మెక్‌కల్లమ్, బెన్ స్టోక్స్ రీప్లేస్‌మెంట్స్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటిం చింది. టెస్ట్ ఫార్మాట్‌కు కోచ్‌గా న్యూజిలాం డ్ దిగ్గజ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను నియమించింది.

అలాగే టెస్ట్ జట్టుకు సారథిగా జో రూట్‌ను ఎంపిక చేసింది. 53 ఏళ్ల ఫ్లె మింగ్‌కు ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోచ్‌గా మంచి రికార్డుంది. అయితే ఇప్పటివరకు ఏ జాతీయ జట్టుకూ ప్రధాన కోచ్‌గా పనిచేయలేదు. ఐపీఎల్‌లో ఫ్లెమింగ్ కోచింగ్‌లోనే సీఎస్కే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్‌గా తొలిసారి ఒక జాతీయ జట్టుకు కోచ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. మరోవైపు జో రూట్ 2017 నుంచి 2022 వరకు ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.  65 టెస్టుల్లో 27 విజయాలు అందించాడు.