కేంద్రం దిగివచ్చేలా బీసీ ఉద్యమం
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): దేశం నలుమూలల బీసీ ఉద్యమాన్ని విస్తరించడానికి ఏపీ నుండి యూపీ వరకు, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు సభలు, సమావేశాలు నిర్వహించి బీసీల సత్తాను కేంద్ర ప్రభుత్వం తెలిసేలా చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శుక్రవారం హైదరాబా దులోని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యాలయంలో ఆగస్టు 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి యువజన మహిళ ఉద్యోగ కుల సంఘాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాల ఓబిసి ప్రతినిధులను ఆహ్వానించామని, ఈ మహాసభలో దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్తు రాజకీయ ఉద్యమాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. మహాసభకు విద్యార్థి యువజన మహిళ ఉద్యోగ కుల సంఘాల నేతలు వేలాదిగా వచ్చి విజయవంతం చేయాలన్నారు.






