6 April, 2026 | 3:33 AM

బాబుజగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

06-04-2026 01:41 AM

సూర్యాపేట, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అన్నారు. ఆదివారం డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ 119 జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండు వద్ద  ఏర్పాటుచేసిన జయంతి ఉత్సవాలకు ఆయన హాజరై . జగ్జీవన్ రామ్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులు  అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులను, అనగారిన ఆట్టడుగు వర్గాల వారిని ఏకం చేసి అనేక ఉద్యమాలలో పాల్గొని వారి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారన్నారు.   కార్యక్రమంలో మున్సిపల్ చైర్  పర్సన్ మొరిశెట్టి నివేదిత, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి వెంకటరమణ,

స్సీ సంక్షేమ అధికారి శ్రీలత, మున్సిపల్  కమిషనర్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీఉల్లా, తాసిల్దార్ కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, నాయకులు జీడి బిక్షం, ములకలపల్లి రాములు, నెమ్మది బిక్షం, నెమ్మది వెంకటేశ్వర్లు, చల్లమాల నరసింహారావు, డాక్టర్ రామ్మూర్తి,  టిఎన్జీవోస్ జిల్లా ప్రెసిడెంట్ జానీ మియా, సెక్రటరీ దున్న శ్యామ్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దళిత హక్కుల మహానేత బాబు జగ్జీవన్ రామ్

దేవరకొండ, ఏప్రిల్ 5 : దళిత హక్కుల మహానేత, స్వాతంత్య్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్  అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కంబాలపల్లి వెంకటయ్య అన్నారు. ఆదివారం 119వ జయంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, అరేకంటి యేసయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కొండ్రపల్లి రమేష్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు పొట్ట ప్రభు, మద్దిమడుగు నవీన్, అంకూరి హరీష్, అంకూరి శివ, జనసేన చందు పాల్గొన్నారు.

తుంగతుర్తిలో..

తుంగతుర్తి, ఏప్రిల్ 5 : సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, వివిధ సంఘాల నాయకులు  ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయి బాబా, కత్తుల నరేష్, రవీందర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుండె గాని రాములు గౌడ్ తడకమళ్ళ రవికుమార్ , గోపగాని రమేష్, బొజ్జ సాయికిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు, కొండరాజు, మాచర్ల అనిల్ దాసరి శ్రీను, పోలేపాక రామచంద్ర, హెంల నాయక్ పాల్గొన్నారు.

చిట్యాల..

చిట్యాల, ఏప్రిల్ 5 : చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో బాబు జగ్జీవన్ రావు  జయంతి వేడుకలను నిర్వహించారు. పెద్ద కాపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో బాబు జగ్జీవన్ రావు జయంతిని  పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి  చిట్యాల మండల సర్పంచుల  ఫోరం అధ్యక్షుడు కాటo వెంకటేశం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, పంచాయతీ సెక్రెటరీ కంచర్ల గౌతంరెడ్డి, వార్డు సభ్యులు కురు యాదయ్య, జెల్ల ప్రశాంత్, ఏర్పుల మల్లేశ్వరి, చేకూరి గణేష్, నీలకంఠం లింగస్వామి, కందిమల్ల జోగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.