14 June, 2026 | 6:53 PM

దిశ దినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

14-06-2026 05:46 PM

చల్ల కోటి  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

చర్ల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చల్లకోటి వాసుదేవకుమార్ తండ్రి చల్లకోటి లక్ష్మీనారాయణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయగా, ఆదివారం చర్ల మండలం గొంపల్లి గ్రామంలో దిశ దినకర్మ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ... చల్లకోటి లక్ష్మీనారాయణ తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని అన్నారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.