రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లు
29-06-2026 09:10 AM
ఎర్రుపాలెం జూన్ 29 (విజయ క్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలలో రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లు వేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు కార్యకర్తలు చింతకానిలో 30వ తేదీన జరిగే రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని గ్రామాలలో వాల్ పోస్టులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరిగి రైతులు, మహిళలు, కాంగ్రెస్ సానుభూతిపరులు, ప్రజలు రైతు ఆశీర్వాద సభకు వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నారు.






