29 June, 2026 | 10:17 AM

కూకట్‌పల్లి ఏటీఎంలో అగ్నిప్రమాదం

29-06-2026 09:08 AM

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని(Kukatpally) వడ్డేపల్లి ఎన్‌క్లేవ్‌లో సోమవారం తెల్లవారుజామున ఏటీఎం కియోస్క్‌లో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. స్థానికంగా ఉన్న DBS ఏటీఎం సెంటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సమీపంలోని నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కొద్ది నిమిషాల్లోనే మంటలను ఆర్పేసింది. ఆ కియోస్క్‌లో అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కియోస్క్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు.