18-02-2026 01:36:57 AM
శ్రీ కృష్ణ దేవరాయ స్వర్ణ కంకణ ప్రదానం
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాం తి): శ్రీ కృష్ణ దేవరాయ జయంతి సందర్భంగా తెలుగు భాషకు చేస్తున్న విశిష్ఠ సేవలకు గాను ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు, ప్రఖ్యాత గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్‌ను ఎమ్‌ఎస్ బాల సుబ్రహ్మణ్యం కళా సంస్థ కె.వి. బ్రహ్మానందం, తెలుగు కళా వాహిని సంస్థలు సంయుక్తంగా విజయవాడ కౌతా పూర్ణానంద హాలులో శ్రీ కృష్ణ దేవరాయ పురస్కారం స్వర్ణ కంకణ ప్రదానంతో సత్కరించాయి.
విశ్వ గజ ల్ గాయక సార్వభౌమ అన్న బిరుదును ప్రదా నం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షులుగా గోళ్ల నారాయణరావు, విశిష్ఠ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గో పాల కృష్ణ, రోటరీ పూర్వ గవర్నర్ ఎమ్. సి.దా సు, ప్రముఖ రచయిత రసరాజు పాల్గొన్నారు.