10 July, 2026 | 1:02 AM

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

09-07-2026 02:00 PM

బోథ్, జూలై 9 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సాయి నగర్ సమీపంలో రోడ్డుపై పడిపోయిన పర్సు సంబంధి త వ్యక్తికి అప్పజెప్పి తన నిజాయితీని చాటుకున్నాడు మండల కేంద్రానికి చెందిన ఎస్కే షకీల్ గురువారం రోడ్డు పై వస్తుండగా ఆయనకు పర్సు లభించింది అందులో పదివేల రూపాయలు ఉండడంతో వెంటనే ఆటో అడ్డాపైకి వచ్చి పర్సు పోయిన వ్యక్తి ఎవరని ఆరా తీశారు దీంతో పర్సన్ పోగొట్టుకున్న మరో ఆటో డ్రైవర్ తన పర్సు పోయిందని తెలపడంతో వెంటనే ఆయనకు అప్పగించారు నిజాయితీ చాటుకుని ఆటో డ్రైవర్ను పలువురు అభినందించారు