కుబీర్‌లో సోయా రైతుల ఆందోళన
10-07-2026 01:00 AM
కుబీర్, జులై 9 (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని వానాకాలం సీజన్లో సోనం సీడ్ కంపెనీకి చెందిన సోయ విత్తనాలు వేసి నష్టపోయిన రైతులు గురువారం ఆందోళన చేశారు. కుబీర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామానికి చెందిన రైతులు విత్తనాలు విత్తి 20 రోజులు అయినా పంట మొలకెత్తడం లేదని రైతులు ఆందోళన చేశారు.
మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అప్పుడే కుబేర్ పర్యటనకు వస్తున్న కలెక్టర్ అక్కడికి చేరుకొని రైతుల వద్దకు వెళ్లి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంపెనీపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులకు తిరిగి బ్యాగులు ఇప్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీదేవి,అధికారులు ఉన్నారు.






