10 July, 2026 | 1:01 AM

వెంకట్రావుపేట హైస్కూల్‌లో కిచెన్ షెడ్‌కు భూమిపూజ

09-07-2026 02:02 PM

మల్లాపూర్, జూలై 9(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న కిచెన్ షెడ్‌కు గురువారం భూమిపూజ నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు చొరవతో ఈ పనులకు నిధులు మంజూరైనట్లు గ్రామ సర్పంచ్ వెంకటేష్ తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా సాగేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,చైర్మన్, కాంగ్రెస్ నాయకులు,పాల్గొన్నారు.