23 August, 2026 | 12:34 AM

నేటి ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్ల బంద్‌కు కార్మికలోకం కదలాలి

22-08-2026 11:37 PM

డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి- ఎం.కె. బోసు

ముషీరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం.కె. బోసు డిమాండ్ చేశారు. డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న నిరవధిక బంద్‌ను విజయవంతం చేయాలని కార్మికలోకానికి పిలుపునిచ్చారు. శనివారం దోమలగూడలోని తెలుగుదేశం నగర పార్టీ కార్యాలయంలో తెదేపా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నల్లెల కిశోర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బంద్‌కు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి ఎం.కె. బోసు మాట్లాడారు.