23 August, 2026 | 1:23 AM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అంశాలపై సమీక్ష

23-08-2026 12:26 AM

మంత్రి పొంగులేటి అధ్యక్షతన అధికారులతో కీలక సమావేశం

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెవెన్యూ, గృహ నిర్మాణం, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, సర్వే తదితర అంశాలపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ, గృహ నిర్మాణం, భూముల సర్వే, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై అధికారులు సమగ్రంగా వివరించారు.రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు, భూముల సర్వే, రిజిస్ట్రేషన్‌ సేవలు, గృహ నిర్మాణ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు.