పెట్టుబడులకు తెలంగాణను ఎంచుకోండి
- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం
- టెక్నాలజీ నుంచి జీవశాస్త్రాల వరకు.. సాగునీటి నుంచి ఆహారశుద్ధి వరకు అపార అవకాశాలు
- ప్రపంచ వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు మంత్రి ఉత్తమ్ పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోవాలని ప్ర పంచ వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘తెలంగాణకు రం డి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. తెలంగాణలోనే ఆవిష్కరించండి. ప్రపంచానికి అవసరమైన పరిష్కారాలను ఇక్కడే ఊహిద్దాం.. ఇక్కడే ఆవిష్కరిద్దాం.. ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిద్దాం’ అని స్పష్టం చేశారు.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నవకల్పనకు వెన్నుదన్నుగా నిలిచే యువశక్తి, పెట్టుబ డులకు వేగంగా స్పందించే పారదర్శక ప్రభుత్వం.. ఈ నాలు గు బలమైన స్తంభాలపై తెలంగాణ ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వం కలిగి న పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం అవతరిస్తుందని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థి క శక్తిగా ఎదగడమే లక్ష్యమని అన్నారు.
టెక్నాలజీ నుంచి జీవశాస్త్రాల వరకు.. సాగునీటి నుంచి ఆహారశుద్ధి వరకు అపార అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయ ని పేర్కొన్నారు. హైదరాబాద్‌కే అభివృద్ధి పరిమితం కాకుండా, జిల్లాలు, పట్టణాలు, గ్రామాలకూ విస్తరించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో శనివారం జరిగిన ‘గ్లోబల్ బిజినెస్ ఎక్సలెన్స్ అండ్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్2026’లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం కేవలం గణాంకాల్లో కనిపించే ఆర్థిక వృద్ధి మాత్రమే కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, భవిష్యత్ తరాలకు సుస్థిరమైన అభివృద్ధి పునాదులు నిర్మించడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 2025 26లో తెలం గాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) సుమారు రూ.17.82 లక్షల కోట్లకు చేరుతుం దని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
జాతీ యస్థాయిలో నామమాత్రపు వృద్ధి రేటు 8 శాతంగా ఉండగా, తెలంగాణ 10.7 శాతం వృద్ధి నమోదు చే యడం రాష్ట్ర ఆర్థిక అంతర్గతశక్తికి, విస్తరిస్తున్న అవకాశాలకు నిదర్శనమన్నారు. ఈ వృద్ధిని మరింత వేగవంతం చేస్తూ తెలంగాణను దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తుల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే ప్ర భుత్వ సంకల్పమని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక ప్రణాళిక రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్ట మైన దిశానిర్దేశం చేస్తోందని పేర్కొన్నారు.
2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంద న్నారు. టెక్నాలజీ, అత్యున్నత విలువ కలిగిన పరిశ్రమలు, సేవా రంగాలకు కేంద్రంగా పట్టణ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దేదే క్యూర్ అన్నారు.
నగర పరిసర ప్రాంతాల్లో తయారీ, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలను విస్తరించేది ప్యూర్ అని స్పష్టం చేశారు. వ్యవసాయం, ఆహార శుద్ధి, గ్రామీణ పారిశ్రామిక రంగాలకు కొత్త జీవం పోసేదే రేర్‌ని వెల్లడించారు. ఈ మూడు ప్రాంతాలు తెలంగాణ సమగ్ర ఆర్థిక పురోగతికి పరస్పర పూరక శక్తులుగా నిలుస్తాయని వివరించారు.
రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి విస్తరించాలి
“అభివృద్ధి హైదరాబాద్ చుట్టూ గీసుకున్న సరిహద్దుల్లో ఆగిపోకూడదు. అది ప్రతి జిల్లాకు చేరాలి.. ప్రతి పట్టణాన్ని తాకాలి.. ప్రతి గ్రామం లో కనిపించాలి.. ప్రతి తెలంగాణ కుటుంబం జీవితంలో మా ర్పుగా ప్రతిఫలించాలి” అని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధికి నిజమైన అర్థం రావాలంటే అవకాశాలు కొద్ది ప్రాంతాలకు, కొద్ది వర్గాలకు పరిమితం కాకుండా రాష్ట్రం నలుమూలలా విస్తరించాలన్నారు.
హైదరా బాద్ ఇప్పటికే సమాచార సాంకేతికత, కృ త్రిమ మేధ, ఔషధ తయారీ, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు అంత ర్జాతీయ కేంద్రంగా తనదైన ముద్ర వేసిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార సంస్థలు తెలంగాణను కేవలం మార్కెట్‌గా కాకుండా పరిశో ధన, ఆవిష్కరణ, ఉత్పత్తి, ప్రపంచ మార్కెట్లకు విస్తరణకు వ్యూహాత్మక కేంద్రంగా చూడాలని కోరారు.
తాను నిర్వహిస్తున్న నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖల పరిధిని ప్రస్తావిస్తూ నీరు వ్యవసాయం ఆహార భద్రత పరిశ్రమల మధ్య ఏర్పడుతున్న అనుసంధానం భవి ష్యత్ పెట్టుబడులకు మరో విశాలమైన ద్వారం తెరుస్తోందని ఉత్తమ్ చెప్పారు. పెట్టుబడిదారులు హైద రాబాద్‌ను దాటి తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలు, అభివృద్ధి కేంద్రాల వైపు కూడా దృష్టి సారిం చాలని కోరారు.
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి నగ రాలు భవిష్యత్ పారిశ్రామిక, సేవా, లాజిస్టిక్స్, ఆహార శుద్ధి కేంద్రాలుగా ఎదగగల అపార సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం కూడా పెట్టుబడిదారులతో తాత్కాలిక అనుబంధాన్ని కా కుండా పారదర్శకమైన, వృత్తిపరమైన, వేగంగా స్పందించే దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.






