23 August, 2026 | 1:22 AM

చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సత్యం

23-08-2026 12:31 AM

కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో ఇటీవల కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందగా, వారికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం శనివారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పర్వతాలకు 30 వేల  రూపాయలు,ఒల్లం లచ్చవ్వ కు 15 వేల రూపాయలు చెక్కులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఎగుర్ల తిరుపతి, గడ్డం జీవన్ రెడ్డి, మల్లేశం, ప్యాక్స్ చైర్మన్ రాజనర్సింగరావు, మండల అధ్యక్షుడు గోగూరి నాగభూషణ్ రెడ్డి, కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్,మండల యూత్ అధ్యక్షుడు గాజుల అజయ్ గౌడ్, జలంధర్, గోల్కొండ రాజు,రమణారెడ్డి,నిఖిల్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి.ప్రకాష్,ఎంపీడీవో ఇ.స్వరూప,మండల పశు వైద్యాధికారి డాక్టర్  రాకేష్,ఎస్సైలు ఎ.నరేష్ కుమార్, ఎస్.సందీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.