హాష్ ఆయిల్ అక్రమ రవాణా గుట్టు రట్టు
ఎల్బీనగర్ ఎస్ఓటి, నాగోలు పోలీసుల సంయుక్త ఆపరేషన్
ఇద్దరు నిందితుల అరెస్టు
రూ.1.75 కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
మేడ్చల్,(విజయక్రాంతి): మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు హాష్ ఆయిల్ రవాణా గుట్టురట్టు చేశారు. ఎల్బీనగర్ ఎస్ఓటి, నాగోల్ సంయుక్తంగా ఆపరేషన్ చేసి రూ.1.75 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోవడమే గాక ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సిపి సుమతి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈనెల 21న గౌరెల్లి ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్ పై హైదరాబాద్ వైపు వస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో మొత్తం 14 ప్యాకెట్లలో 14.2 కిలోల ఆస్ట్ ఆయిల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా లోని మల్కానగిరి జిల్లాకు చెందిన తమర గోపాల్ ఇద్దరికీ 7 కిలోల చొప్పున హార్ట్ ఆయిల్ అప్పగించి హైదరాబాద్కు తరలించాలని చెప్పినట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. ఇందుకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెల్లిస్తామని గోపాల్ హామీ ఇచ్చారు హైదరాబాదు చేరుకున్న తర్వాత డెలివరీ వివరాలు ఇస్తామని గోపాల్ చెప్పినట్లు నిందితులు తెలిపారు. ప్రస్తుతం గోపాల్ పరారీ లో ఉన్నాడు. నిందితులైన పల్లె నాగరాజు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వాడు.
పెడ్లార్ కం ట్రాన్స్పోర్ట్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో 10 కిలోల గంజాయి కేసులో నిందితుడు. మరొక నిందితుడైన నాగుల నారాయణ ఆలియాస్ కిరణ్ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వాడు. గతంలో 140 కిలోల గంజాయి కేసులో నిందితుడు. నిందితులపై నాగోల్ పోలీస్ స్టేషన్లో ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరొక కేసులో అంతర్రాష్ట్ర తుపాకుల సరఫరాదారును పట్టుకున్నారు. అతని వద్ద రెండు ఎంఎం పిస్తాళ్ళు, 17 లైవ్ బుల్లెట్లు, ఒక డబుల్ బ్యారెల్ తుపాకీ పట్టుకున్నారు.






