23 August, 2026 | 1:10 AM

విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలి

23-08-2026 12:15 AM

మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి రవి శంకర్

కోయిలకొండ: కోయిలకొండ మండలంలోని గార్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి రవి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు న్యాయ చట్టాలు, వాటి ప్రాధాన్యత, ప్రతి పౌరుడి బాధ్యతల గురించి జిల్లా జడ్జి రవి శంకర్ వివరంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని తెలిపారు. కార్యక్రమంలో కోయిలకొండ మండల ఎస్‌ఐ నాగరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.