23 August, 2026 | 1:11 AM

విలేఖరిపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలి

23-08-2026 12:29 AM

మధు వంశీకృష్ణను 48 గంటల్లో అరెస్టు చేయకపోతే భూపాలపల్లి బంద్ కు పిలుపునిస్తాం

ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్

భూపాలపల్లి టౌన్,(విజయ క్రాంతి): చిట్యాల ఆర్.బి న్యూస్ రిపోర్టర్ పుల్ల రవీందర్ కళావతి దంపతులపై  దాడి చేసిన  మధు వంశీ రావును వెంటనే అరెస్టు చేయాలని  అంబేద్కర్ సెంటర్ లో శనివారం నిర్వహించిన ధర్నాలో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజు డిమాండ్ చేశారు. బిసి ఎస్సి, ఎస్టీ జేఏసీ నాయకులు ఆర్.బి న్యూస్ విలేకరి పుల్ల రవీందర్ పై జరిగిన దాడిని నిరసిస్తూ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మసమాజ్ పార్టీ  వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజు హాజరైన అనంతరం జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలి వద్ద కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత విలేకరి పుల్ల రవీందర్ పై దాడి చేసిన మధువంశీ రావును గత నాలుగు రోజుల నుండి ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేయలేదు దీనికి కారణం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిఎస్పి సంపత్ రావు వారి కులానికి సంబంధించిన వ్యక్తి కావడంతో మధు వంశీని కాపాడుకుంటూ వస్తున్నారని మధు వంశీ పై గతంలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని జైలుకు వెళ్లి రావడం జరిగిందని తెలిపారు.

అలాగే స్థానిక చిట్యాల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ కేసు కూడా నమోదయిందని ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీ  నాయకుడు కావడం స్థానిక డిఎస్పి  సంపత్ రావు ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్న ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి మధు వంశీ రావును వెంటనే అరెస్టు చేయించాలని లేదంటే రాష్ట్ర డిజిపి ని ధర్మసమాధి పార్టీ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ రాష్ట్ర నాయకులు కలిసి దళిత విలేకరు రవీందర్ పై జరిగిన హత్యాయత్నం  వివరించడం జరుగుతుంది.

అలాగే అతనికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది విలేఖరికి  న్యాయం జరిగేంతవరకు స్థానిక అంబేద్కర్ సెంటర్ లో కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని  హెచ్చరించారు. రాష్ట్ర డిజిపి వెంటనే స్పందించి విలేకరి పై దాడి చేసిన మధు వంశీ రావును అరెస్టు చేయాలని 48 గంటల్లో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ  సంకీర్త్ ఫోన్ లో మాట్లాడి హామీ ఇచ్చారని  48 గంటల్లో మధువంశీరావును అరెస్టు చేయకపోతే మరుసటి రోజే భూపాలపల్లి జిల్లాను ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిస్తామని బాధితులకు న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తామని డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో టిసిఎస్సి ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు  రాఘవేంద్ర ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కమల్ రడపాక, వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ చంద మల్లయ్య, కోఆర్డినేటర్ మేకల సుమన్, రాష్ట్ర కార్యదర్శి సాయి బాబా, జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్, అశోక్, చిట్యాల శ్రీనివాస్,  రమేష్, రవి,  పుల్ల అశోక్, శీలపాక నాగరాజు నేరెళ్ల రమేష్ నద్దునూరి రాజ్ కుమార్ రత్న రమేష్ పర్లపల్లి కుమార్ చిలుముల శశి కుమార్ పుల్ల శైలెందర్ పుల్ల సదయ్య పుల్ల సతీష్ సంపంగి శ్రీను ధర్మ సమాజ్ పార్టీ  కార్య కర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.