6 June, 2026 | 3:06 AM

మలేషియాకు కేటీఆర్

06-06-2026 01:42 AM

ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు

నేడు కౌలాలంపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా శుక్రవారం మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్‌ఎస్ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీన కౌలాలంపూర్‌లో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మలేషియాకు చేరుకున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్న కేటీఆర్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రవాస తెలంగాణ ప్రతిని ధులు, బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

స్వాగతం పలికిన వారిలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్‌కుమార్, మైటా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్‌ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతితో పాటు ఇతర ముఖ్య నేతలు, ఎన్నారైలు ఉన్నారు. కేటీఆర్ రాకతో మలేషియాలోని ప్రవాస తెలంగాణ సమాజంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. నేడు జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు, విజయవంతం చేసేందుకు మైటా, బీఆర్‌ఎస్ మలేషియా కమిటీలు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి.