దేవాలయంలో అసిస్టెంట్ కమిషనర్ పూజలు
04-04-2026 12:22 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 3: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అర్వపల్లి లోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని శుక్రవారం దేవాదాయ శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ శర్మ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు. అర్చకులు రాంబాబు అయ్యంగార్, పవన్, ధర్వేశిపురం ఆలయ అర్చకులు మహేష్ శర్మ పాల్గొన్నారు.




