4 April, 2026 | 3:56 AM

దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించాలి

04-04-2026 12:23 AM

సంస్థాన్ నారాయణపూర్, ఏప్రిల్ 3: సంస్థాన్ నారాయణపూర్ మండలం కేంద్రంలో  దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నర్సింహ  ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య కురుమ 99వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య కురుమ తెలంగాణ రైతాంగ సాయిదా పోరాటంలో తొలి అమరుడుగా చరిత్రలో నిలిచారని తెలిపారు.

రైతుల హక్కులు సామాజిక న్యాయం సమానత్వం కోసం  చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని అన్నారు.     ఈ కార్యక్రమంలో నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి , నారాయణపూర్ ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, మాజీ సర్పంచ్  కోన్రెడ్డి నర్సింహ, మాజీ ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య యాదవ్, కుమ్మరి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిలివేరు అంజయ్య, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్ పాల్గొన్నారు.