మద్యం మత్తులో ఏఎస్‌ఐపై దాడి
24-05-2026 12:47 AM
కేసముద్రం, మే 23 (విజయక్రాంతి): పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మందుబాబులు దాడికి పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా పెనుగొండలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులను వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించగా, వారు తిరగబడి రాళ్లను విసిరారు. ఏఎస్‌ఐ సదయ్యపై దాడికి పాల్పడ్డారు. ఏఎస్‌ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ నలుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.






