24 May, 2026 | 3:08 AM

అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు

24-05-2026 12:45 AM

నిర్మల్, మే 23(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని మూడు అనాథ మృతదేహాలకు ఐక్యత సేవా సంస్థ సభ్యులు అంతక్రియలు నిర్వహించారు. రోడ్డుపై భిక్షాటన చేస్తూ జీవితం గడుపుతున్న ముగ్గురు మూడు రోజుల నుంచి మరణించారు.

వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించినప్పటికీ కుటుంబ సభ్యుల వివరాలు తెలియలేదు. దీంతో మృతదేహాలను ఏరియా హాస్పిటలకు తరలించారు. అనంతరం పోలీసులు ఐక్యత సేవ సమితి సభ్యులను సంప్రదించారు. దీంతో ఐక్యత సేవ సమితి సభ్యులు మూడు అనాథ మృతదేహాలకు హైందవ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.