వేణుగోపాలస్వామి వార్షికోత్సవంలో పాల్గొన్న ఏరియా జి.ఎం చింతల శ్రీనివాస్
జి.ఎం దంపతులను సన్మానించిన వార్డ్ కౌన్సిలర్ ఉప్పు నాగమణి హనుమంతరావు
సత్తుపల్లి, మార్చి 23 (విజయక్రాంతి): స్థానిక సత్తుపల్లి పట్టణం జవహర్ నగర్ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సత్తుపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ లక్ష్మి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ లక్ష్మి దంపతులను సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు వార్డ్ కౌన్సిలర్ ఉప్పు నాగమణి హనుమంతరావు. ఈ కార్యక్రమంలో దివల పెద్దిరాజు , దివేళ , శ్రీను , రమేష్ , గంధం బాబీ , రామక్రిష్ణ , వెంకటేశ్వరరావు , వాసు , జి.కాశీ విశ్వనాథ్ , భీమిరెడ్డి కృష్ణారెడ్డి , మరియు మహిళ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




