ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2కే రన్‌ను జిల్లా కలెక్టర్ కె. హరిత అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలసి శనివారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమం లక్ష్యాలు, ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన 2కే రన్ కేబీ చౌక్, అంబేద్కర్ చౌక్, వివేకానంద చౌక్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి గుండా కలెక్టరేట్‌కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.






