20 June, 2026 | 4:06 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

కోతుల బెడద నివారణకు బోన్లు ఏర్పాటు

24-03-2026 12:12 AM

అశ్వాపురం, మార్చి 23 (విజయక్రాంతి): మండలంలోని నెల్లిపాక బంజర గ్రామపంచాయతీలో కోతుల బెడదను తగ్గించేందుకు సర్పంచ్ మండ్రు వెంకట రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో కోతుల సంచారం పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో పంచాయతీ పరిధిలో కోతులను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ బోన్లను గ్రామపంచాయతీ కార్యాలయం వద్దతో పాటు టేకులగుట్ట అంగన్వాడీ కేంద్రం వద్ద ఉంచినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామస్థులు తమ ఇళ్ల వద్ద మిగిలిపోయిన ఆహార పదార్థాలను బయట ఉంచకుండా, వాటిని ఈ బోన్లలో వేయాలని కోరారు. గ్రామ ప్రజల సహకారం ఉంటే కోతుల సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చని, అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని కోతుల బెడద నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు.