20 June, 2026 | 2:35 AM

జాడలేని చినుకు

20-06-2026 01:21 AM

ఆకాశం వైపు అన్నదాత ఎదురుచూపు! 

వానాకాలం మొదలై.. మూడువారాలు కావస్తున్నా వర్షాలు కరువు

  1. తొలకరి చినుకులతో పత్తి విత్తనాలు వేసిన రైతులు 
  2. ఎండిపోతున్న మొక్కలు 
  3. ఎండవేడిమితో మొలకెత్తని 70% పత్తి విత్తనాలు 
  4. రాష్ట్రంలో 134.66 లక్షల ఎకరాల సాగు అంచనా వేసిన వ్యవసాయ శాఖ 
  5. అందులో వరి పంట 69 లక్షలు, పత్తి 48 లక్షల ఎకరాలు

* అన్నదాత కంటిమీద కునుకులేని కాలమిది.. రుతుపవనాలు తెలంగాణను ఆలస్యంగా పలకరించినా, వర్షాభావ పరిస్థితులు దడపుట్టిస్తు న్నాయి. చినుకు కరువై, ఎండలు దంచికొడుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి రైత న్నను వెంటాడుతుంది. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్ కోతల సమస్యలు తప్పేటట్టులేదని అన్నదాతలు వాపోతున్నారు. విత్తనాలు నాటేందుకు చినుకు కరువైందని బాధపడుతున్న రైతాంగానికి, ఈసారి కూడా పంట అమ్ముకునేవరకు కష్టాలు తప్పవా అనే ప్రశ్నలు కొడవళ్లలా గుచ్చుకుంటున్నాయి.

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : ప్రతే ఏటా అతివృష్టి లేదా అనావృష్టితో కష్టాలపాలవుతున్న అన్నదాతకు ఈ ఏడాది తొలకరితోనే కడగండ్లు ఎదురయ్యాయి. రాష్ట్రానికి నైరుతి పవనాలు రావడం ఆలస్యం కావడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాలలో ఇంకా వాన జాడే కనిపించలేదు. దాంతో రైతున్న ఆకాశం వైపు ఎదురుచూపులు చూస్తున్నాడు. ప్రతి ఏటా మే నెల చివరివారంలో ఒకటి, రెండు వర్షాలు కురిస్తే.. దుక్కు లు దున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధమయ్యే వారు.

ఈసారి అం దుకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అదిలాబాద్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లా లోని  రైతులు ఇప్పటికే సుమారుగా 3 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే తొలకరి జల్లులకు పత్తి, కంది, ఇతర పంటలు మొలకెత్తాయి. ఆ తర్వాత వర్షాలు పడకపోవడంతో మొలకెత్తిన మొక్కలు ఎండలకు వాడిపోతున్నాయి.

అంతేకాకుండా విత్తిన విత్తానాల్లోనూ దాదాపు 70 శాతం వరకు మొలకెత్తకపోగా, మొలకెత్తిన విత్తనాలు వాడిపోతుండటంతో రైతుల ఆశలు ఆవిరిగా మా రుతున్నాయి. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 40 నుంచి 50 వేలు ఎకరాల వరకు పత్తి విత్తనాలు నాటినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే రైతులు అప్పోసప్పో చేసి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు..  రెండోసారి విత్తనాలు కొనుగోలు చేసేందుకు మరోసారి అప్పులు చేయకతప్పదని ఆందోళన చెందుతున్నారు.

జూన్ నెలలో రుతుపవనాల రాక తో విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయంలో.. ఎండలు తీవ్రస్థాయిలో ఉండటం అన్నదాతలను బెంబేలెత్తిస్తున్నది. ఈ వానాకాలం సీజన్‌కు వ్యవసాయ శాఖ పంటల సాగుకు భారీ ప్రణాళికనే సిద్ధ్దం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 134.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుఅవుతాయని, అందు లో వరిపంట 69 లక్షల ఎకరాలు, పత్తి 48 లక్షల ఎకరాల్లో సాగు అవుతాయని ప్రభు త్వం భావిస్తోంది. మొక్కజొన్న, కందులు, సోయాబిన్, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, నూనెగింజల పంటలన్నీ కలిపి 17.66 లక్షల ఎకరాల్లో సా గు కావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 

గత ఏడాది పంటలు.. 

గత ఏడాది వానాకాలం సీజన్‌లో రాష్ట్రం లో మొత్తం 1.32 కోట్ల ఎకరాలకు పైగా వివి ధ రకాల పంటలు సాగయ్యాయి. అం దులో వరి 67.04 లక్షల ఎకరాలు, పత్తి 45. 85 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.41 లక్షల ఎకరాలు, కందులు 4.92 లక్షల ఎకరాలు, సో యాబీన్ 3.62 లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తంగా సాగు విస్తీరణంతో పోలిస్తే 100 శాతానికి పైగా సాగు నమోదైంది. గత ఏడా ది మంచి వర్షాలు పడటం, చెరువులు, ప్రా జెక్టుల్లో సమృద్దిగా నీటి నిల్వలు ఉండటం వల్ల రైతులు ధైర్యంగా సాగు చేపట్టారు, కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

వేసవి ప్రారంభం నుంచే నీటి లభ్యతపై ఆం దోళన నెలకొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి, వరిని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆ పంటల వైపే మొగ్గు చూపుతున్నారు, మొత్తం సాగు విస్తీర్ణంలో 90 శాతం వరి, పత్తి పంటలకే మొగ్గు చూపుతారని వ్యవసాయ శాఖ చెబుతున్నది.

ప్రచారానికే పరిమితం..? 

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని, తక్కువ నీటిని తీసుకునే ఆరుతడి పంటలు వేయాలని రైతులకు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ఆరుతడి పంటల విషయంలో రైతుల్లో పూర్తిగా అవగాహన కల్పించకుండా.. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుందనే విమర్శలు ఉన్నా యి. ఆరుతడి పంటల్లో ఏమి సాగు చేయా లో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.

రైతులు ఆరుతడి పంటలు వేస్తే.. వాటికి కావాల్సిన రవాణా, మార్కెట్ సౌకర్యం, పంటలకు మద్దతు ధరలపై సర్కారు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని, అప్పుడే రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతారని  రైతు సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. వరి, మొక్కజొన్న కొనుగోలులో మొన్నమొన్నటివరకు రైతులు అనేక ఇక్కట్లను ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి ఎదురుచూపులు చూడాల్సివచ్చింది. ఆరుగాలం శ్రమించి పంట దిగుబడి చేసినా, తగిన ఫలితం దక్కడంలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.