కర్మన్‌ఘాట్ ఆలయానికి భారీగా కానుకలు
- 145 రోజులుగా వచ్చిన ఆదాయం రూ, 63.84 లక్షలు
కలకలం రేపిన నకిలీ కరెన్సీ
ఎల్బీనగర్, మార్చి 23: ప్రసిద్ధ కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో సోమవారం ఉద యం హుండీలను దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, భక్తుల సమక్షంలో లెక్కించారు. ఆలయానికి సంబంధించి 145 రోజులుగా హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. మొత్తం రూ.63,84,446 ఆదాయం వచ్చింది. ఇందులో విదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయి.
67 యూఎస్ డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు, 1 మలేషియా రింగిట్, 120 అరబ్ దిర్హాన్లు, 10 యుకే పౌండ్స్, 100 బంగ్లాదేశ్ టంకాలు, 20 శ్రీలంక రుపీస్, 50 నేపాల్ రూపీస్ వచ్చాయి. హుండీల లెక్కింపులో దేవాదాయ శాఖ పర్యవేక్షకులుగా వెంకట్ ప్రేమ్ కుమార్ రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి లావణ్య, చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి జనుంపల్లి, కుకునూరి గోపాల్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
హుండీలో నకిలీ నోట్లు ప్రత్యక్షం
కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదులో నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నాయి. రూ, 100, రూ, 200, రూ, 500 కరెన్సీ Childrens Bank పేరుతో ఉన్న నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని అంటున్నారు. దీనిపై ఆలయ అధికారులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.




