20 June, 2026 | 2:09 PM

జిల్లాకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

20-06-2026 01:42 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బోథ్ నియోజకవర్గంలో పర్యటించనున్న కేటీఆర్ కు నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కేటీఆర్ పార్టీ శ్రేణులకు ప్రజలకు అభివాదం చేసారు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు జై తెలంగాణ అంటూ చేసిన నినాదాలతో జాతీయ రహదారి మార్మొగింది.