20 June, 2026 | 3:29 PM

Breaking News

హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •   ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. దగా రాజ్యం: లింగాల కమల్ రాజు   •  

జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి

20-06-2026 01:54 PM

ముకరంపుర, జూన్ 20(విజయ క్రాంతి) కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్ జ్యోతినగర్ లో నగరపాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మున్సిపల్ సాధారణ నిధులు రూ. 67.20 లక్షలతో నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్, సిసి రోడ్డును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్  శనివారం  ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు , 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, ఇతర స్థానిక బీజేపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.