2 May, 2026 | 1:13 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

వైభవంగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం

16-03-2026 12:00 AM

పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 15, (విజయక్రాంతి): పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసగిరి కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రివర్యులకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఇద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో వైభవంగా నిర్వహించబడింది. తదనంతరం నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో మంత్రులు ఇద్దరూ భక్తులతో కలిసి కార్యక్రమాన్ని భక్తి పరవశంతో వీక్షించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు మరియు ఆశీర్వాదాలను మంత్రివర్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసగిరి గుట్ట ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రకృతి వనంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని అటవీశాఖ సహకారంతో అభివృద్ధి చేసి గొప్ప ఈకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి భావాన్ని, ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.