8 May, 2026 | 5:20 PM

చినూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక శిబిరం

08-05-2026 04:33 PM

నాగిరెడ్డిపేట్, (విజయక్రాంతి): మండలంలోని చినూర్ గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఫెర్టిలిటీ అండ్ యానిమల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని మండల పశువైద్యాధికారి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి రవికుమార్ హీట్‌వేవ్ ప్రభావం,పశువుల సంరక్షణ,హీట్ మేనేజ్‌మెంట్‌పై రైతులకు అవగాహన కల్పించారు.

అలాగే దూడల ర్యాలీ (కాల్ఫ్ ర్యాలీ) నిర్వహించి గ్రామస్థుల్లో చైతన్యం తీసుకువచ్చారు.శిబిరంలో మొత్తం 44 పశువులకు చూడు పరీక్షలు నిర్వహించగా,8 పశువులకు చూడు కట్టడం జరిగిందన్నారు.12 పశువులకు కృత్రిమ గర్భధారణ చేపట్టారు.అదేవిధంగా 18 దూడలకు నట్టల మందు తాగించారు.ఈ కార్యక్రమంలో చినూర్ సర్పంచ్ మురళీమోహన్ గౌడ్,ఉప సర్పంచ్ సుకన్య,మండల పశువైద్యాధికారి రవికుమార్,కార్యదర్శి సరేందర్,వార్డు సభ్యులు సాతెవ్వ,హన్మండ్లు,రాజు,బి. రాజు,పశువైద్య సిబ్బంది విజయ,ఘౌస్,జయరాజ్, గంగారాం,శ్రీహరి,డెయిరీ రైతులు,గ్రామస్థులు  పాల్గొన్నారు.