6 April, 2026 | 3:24 AM

ఏకాగ్రత, ధ్యానంతో అద్భుత స్మరణాశక్తి

06-04-2026 12:43 AM
  1. హైదరాబాద్ 200వ ‘మహా శతవధానం’ దిగ్విజయం

హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, ఏప్రిల్ 5(విజయక్రాంతి): మానవ మేధస్సు తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని, ఏకాగ్రత, ధ్యానంతో అనంతమైన స్మరణ శక్తిని సొంతం చేసుకోవచ్చని జైన్ మహాఅవధానులు నిరూపిం చారు. జైన్ ఇంటర్నేషనల్ విద్యాపీట్  హైదరాబాద్  ఆధ్వర్యంలో ఆదివారం హైదరా బాద్ బాగ్ లింగంపల్లి ఆర్టీసీ  కళ్యాణ మం డపం ఆడిటోరియంలో  నిర్వహించిన మహా శతవధానం కార్యక్రమం జైన్ మహాగురువులు, జైన సంఘం సభ్యులు, ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. జైన్ మహా అవధాని అభినందన చంద్రసాగర్, ఆయన  శిష్యులు నమీ చందర్ సాగర్,

నేమీ చంద్రసాగర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు  దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా, గౌరవ అతిథులుగా సిఐఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండ్ ఆశిశ్ జైన్, తారక్ మెహతాకా ఉల్టా చెస్మా ప్రతినిధి సమయ్ షా (గోగి), గోలి పాల్గొన్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జ్యోతి ప్రజ్వలన చేసి అష్టావధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ భారతీయ సంస్కృతిలో అవధాన విద్యకు ప్రత్యేక స్థానం ఉందని, కంప్యూటర్ల కంటే వేగంగా మానవ మెదడు పనిచేస్తుందని ఇక్కడి అవధానులు నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో జైన్ ఇంటర్నేషనల్ విద్యాపీఠ్ ట్రస్టీలు కైలాష్ బండారి, సీఏ విక్రమ్ శ్రీశ్రీమల్, అమిత్ వజవత్, హితేష్ జి ముథ, అంకిత్ చోరాదియా,  ప్రతినిధులు ఆకాష్ గురూజీ, అక్షత్ జైనం, రిషబ్, అక్షిత్, ఆర్యన్ జైనం, ప్రానం పాల్గొన్నారు.